భారత్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ముఠా గుట్టు రట్టు చేసినట్లు సూరత్ పోలీసులు తెలిపారు. తాము నిర్వహించిన మెరుపు దాడుల్లో తొమ్మిది మంది బంగ్లాదేశీయులతో సహా 10 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
వారి దగ్గర నుంచి ఆధార్, పాన్, ఓటర్ కార్డులు, లైసెన్స్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ వెల్లడించారు.