అమెరికాలోని కొలరాడో సుప్రీంకోర్టులో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ దుండగుడు సుప్రీంకోర్టు ఏడవ అంతస్తులోకి చొరబడి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోర్టు భవనానికి తీవ్రమైన నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో దుండగుడు చొరబడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే దుండగుడు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదన్నారు.