కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్ పట్టణంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సచిన్ పాటిల్ అనే యువకుడికి స్థానిక వధువుతో పెద్దలు వివాహం నిశ్చయించారు.
పెళ్లి మండపంలో వరుడి తరపు వారు 100 గ్రాముల బంగారం, రూ.10 లక్షల కట్నం డిమాండ్ చేశారు. అదనపు కట్నం ఇవ్వలేదని పెళ్లికి వరుడు నిరాకరించాడు. దీంతో వరుడిపై వధువు కుటుంబీకులు దాడి చేసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.