ఎవరైనా సరే పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడిచే కంటే, బయటకు వెళ్లిపోవటం మంచిదని మంత్రి అమర్నాథ్ అన్నారు. విశాఖలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
"దాడి వీరభద్రరావు మళ్లీ టీడీపలో చేరనున్నట్లు తెలిసింది. టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటాను.. లేకుంటే వెళ్లిపోతాననే వారు నిర్ణయం తీసుకోవచ్చు. రేపు నాకు టికెట్ లేదని, జెండా ఇచ్చి పార్టీ కోసం తిరగాలని చెబితే అలాగే తిరుగుతాను." అని వ్యాఖ్యానించారు.