వైఎస్ జగన్ తో వైఎస్ షర్మిల ఇవాళ భేటీ కానున్నారు. జగన్ నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించనున్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సాయంత్ర 4 గంటలకు భేటీ అవుతారు.
షర్మిల వెంట విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి కూడా ఉంటారని సమాచారం. అయితే జగన్ తో నేరుగా భేటీ ఉండకపోవచ్చేనే వార్తలూ వినిపిస్తున్నాయి. కాగా రాజారెడ్డి-ప్రియల నిశ్చితార్థం ఈ నెల 18న, ఫిబ్రవరి 17 వివాహం జరగనుంది.