పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ పారిశుద్ద్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజు కు చేరుకుంది. ఈ సందర్బంగా కమిషనర్ నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులను పనులలోకి రావాలని కోరడంతో కార్మికులు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పనుల్లోకి రామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాయకులను, కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసి సీఐ కార్యాలయం కు తరలించారు.