ధర్మవరం రైల్వేస్టేషన్లో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మంగళవారం రాత్రి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ కథనం ప్రకారం. ఓ గుర్తు తెలియని యువకుడు(30) నాలుగవ ప్లాట్ ఫారంపై ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి హైటెన్షన్ తీగలను తాకడానికి యత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో. బోగీపై నుంచి కిందపడి చనిపోయాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించ లేదని పోలీసులు తెలిపారు.