బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2. 0 కార్యక్రమాన్ని బుధవారం ఎంపీపీ దాసరి సునీత, గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి, రాష్ట్ర జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ ఆఫీసర్ కె శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ఓబుల్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మండల వ్యాప్తంగా 6, 393 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.