కళ్యాణదుర్గం నుంచి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ ఉద్యోగులను బుధవారం పోలీసులు ఆపి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కళ్యాణదుర్గం పట్టణ శివారులలో బస్సులు ఆపి బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి అంగన్వాడీ కార్యకర్తలను కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు పోలీసుల తీరును ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టారు.