ధర్మవరం టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ బుధవారం ధర్మవరం పట్టణంలో తన పాదయాత్రను ప్రారంభించారు. ఐదు రోజుల పాదయాత్రలో భాగంగా మొదటి రోజు శివానగర్లో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.