పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు సంబంధించి తప్పుడు ఫారం7 లు సమర్పించిన మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు పర్చూరులో ఈ వివరాలు వెల్లడించారు. జీవించి ఉన్నవారు మరణించినట్లుగా పర్చూరులో ఒకరు, యద్దనపూడి లో ముగ్గురు తప్పుడు దరఖాస్తులు సమర్పించారన్నారు. వారిపై కేసులు పెడతామన్నారు.