వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, వారి కుటుంబ సభ్యులను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.పెళ్లి ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి షర్మిల వస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను చేరతాను. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీని వీడి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బలంగా ఉన్నటువంటి పార్టీ. బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వ్యక్తుల గురించి అధిష్టానం చూసుకుంటుంది. వారితో చర్చలన్నీ పార్టీనే జరుపుతోంది అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.