ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ సభలో ఆసక్తికర సీన్.. సీఎం జగన్ ఆ ఇద్దర్ని పిలిచి మరీ! ఫోటోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 06:46 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాకినాడలో పర్యటించారు. రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. ఇప్పటి వరకు పింఛన్ రూ.2,750గా వస్తుండగా.. ఇవాళ్టి నుంచి అది రూ.3 వేలకు పెరిగింది. అయితే కాకినాడ సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ను సీఎం జగన్ పిలిచి భుజం తట్టారు. ఇటీవల నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో వీరికి టికెట్ దక్కని సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com