ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య ప్రారంభోత్సం సందర్భంగా .. ఆరోజు రాష్ట్రంలో మద్యం విక్రయాలు బంద్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 09:40 PM

అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి గడియలు దగ్గరపడుతున్నాయి. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే గర్భగుడిలో ప్రతిష్ఠాపని చేయనున్న ఆ శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోజు డ్రై డే పాటించాలని సీఎం విష్ణు దేవ్ సాయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22 వ తేదీన ఛత్తీస్‌గఢ్‌‍లో మద్యం విక్రయాలు లేకుండా చూడాలని ఆదేశించారు.


అయోధ్యలో దివ్యమైన రామమందిరంలో జనవరి 22 వ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఆ రోజున దేశ వ్యాప్తంగా పండగ వాతావరణ నెలకొననుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో డ్రై డే అమలవుతుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రకటించారు. అంటే ఆరోజు రాష్ట్రంలో ఎలాంటి మద్యం విక్రయాలు జరగకూడదు. రాష్ట్రంలో డిసెంబర్ 25 వ తేదీ నుంచి జనవరి 2 వ తేదీ వరకు జరిగిన గుడ్ గవర్నెన్స్ వీక్ చివరి రోజున సీఎం విష్ణు దేవ్ సాయ్ ఈ ప్రకటన చేశారు.


ఛత్తీస్‌గఢ్‌లో సుపరిపాలన వారోత్సవాలు జరుపుకుంటున్నామని సీఎం తెలిపారు. సుపరిపాలనే తమ సంకల్పం అని, రామరాజ్యమే తమ ఆదర్శమని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ చెప్పారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రంలోని వరి ఉత్పత్తి సంస్థల ద్వారా సుమారు 3 వేల టన్నుల బియ్యాన్ని పంపించామని సీఎం వెల్లడించారు. ఇక రాష్ట్రంలో పండిన కూరగాయలను కూడా అయోధ్యకు పంపిస్తున్నట్లు తెలిపారు.


అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతున్న నేపథ్యంలో రామ మందిరానికి దేశ ప్రజలు తమ వంతు సాయాన్ని చేస్తున్నారు. అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులు అయోధ్యకు పంపిస్తున్నారు. ఇక రాముని తల్లి ఊరిగా భావించే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి భారీగా బియ్యం ట్రక్కులు బయల్దేరాయి. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com