పుంగనూరు నియోజకవర్గం లోని చౌడేపల్లి , సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వైసిపి నాయకులు, అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 3000 పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa