దేశంలో సైబర్ నేరగాళ్ళూ భారీగా దోచుకున్నారు. ఏకంగా గత రెండేళ్ల కాలంలో 10,300 కోట్లకు పైగా మన దేశ ప్రజల నుండి కాజేశారు. ఈ మేరకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బుధవారం వివరాలు వెల్లడించింది.
2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు రూ.10,319 కోట్లు దోచుకున్నట్లు తెలిపింది. ఈ మొత్తంలో దాదాపు రూ.1,127 కోట్ల వరకు దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేయగలిగాయి. దీనిలో కొంతమేర బాధితుల ఖాతాల్లో జమ చేశాయి.