కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు.వివరాల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో, గంటల తరబడి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్(ట్రావెన్‌కోర్ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది.మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్ చేసింది. అలాగే, ఈనెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది.