ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లిలో జరిగిన వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మలసాల భరత్ పరిచయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన మీ రుణం ఎప్పటికీ మర్చిపోనని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.