నెల్లూరు జిల్లాలో నిర్మిస్తోన్న రామాయపట్నం పోర్టు నుంచి త్వరలో వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరుకు తొలి నౌక వచ్చే అవకాశం ఉంది.
రూ.4,902 కోట్ల వ్యయంతో 2022, జూన్ 24న పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తొలి దశలో నాలుగు బెర్తులు అభివృద్ధి చేయనుండగా.. ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఎగుమతుల అనుమతుల కోసం కేంద్రానికి AP మారిటైమ్ బోర్డు లేఖ రాసింది.