రెండు సంవత్సరాలుగా ఎలాంటి లావాదేవీలు నమోదు చేయని (ఇన్‌ఆపరేటివ్) ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆదేశించింది.
అలాగే స్కాలర్‌షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం తీసుకున్న ఖాతాల్లో రెండేండ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరపకపోయినా వాటిని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలుగా పేర్కొనరాదనీ స్పష్టం చేసింది.