యుద్ధ ఖైదీల విడుదలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య భారీ ఒప్పందం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు ఖైదీల విడుదలకు అంగీకారం తెలిపి బుధవారం విడుదల చేశాయి.
ఇందులో భాగంగా ఆరుగురు ఉక్రెయిన్ పౌరులతో సహా 230 మంది సైనికులను రష్యా విడుదల చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అలాగే 248 మంది సైనికులను ఉక్రెయిన్ విడుదల చేసిందని రష్యా పేర్కొంది.