శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన వైయస్సార్ పింఛన్ల కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పింఛన్ కార్డు మరియు 3 వేల నగదు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచారన్నారు.