వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢీల్లీ వెళ్లిన షర్మిల.. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో ఆమె చేరారు.