ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రామనవమి రోజున సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపైన తిలకంలా పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక అద్దాలు, లెన్సులు ఉపయోగించనున్నారు. ఈ 'సూర్య రశ్మి తిలకం' ఏటా శ్రీ రామనవమి రోజునే రామ్ లల్లా నుదుటిపై పడటం ఇక్కడి విశేషం.