గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనలో పాల్గొన్నారు.
కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వడంతో పాటు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని స్పష్టం చేశారు.