కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.
ఈ మేరకు భక్తులు గంటల తరబడి లైన్లో వేచి ఉంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి దర్శనం కోసం పరిమితి మేరకే అనుమతి ఇస్తామని ట్రస్ట్ పేర్కొంది. ఈనెల 14న 40వేలు, 15వ తేదీన 50వేల మందికి అనుమతి ఇచ్చింది.