టికెట్లపై ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ‘ఇంధన ఛార్జీ’ని తొలగిస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఇంధన ధరలు గణనీయంగా పెరిగడంతో మూడు నెలల క్రితం ప్రవేశపెట్టిన ఇంధన ఛార్జీని..
ఇటీవల ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే తొలగించాలని నిర్ణయించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో టికెట్ల ధరలనూ అందుకనుగుణంగా సవరిస్తామని స్పష్టం చేసింది.