చక్రాయపేట మండలంలోని సురభి గ్రామం పాయలోపల్లె వద్ద బుధవారం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. శంకర్, మహేశ్వర్ అనే వ్యక్తులు పశువులను మేత కోసం అడవికి తోలుకెళ్తుండగా చిరుత రావడం గుర్తించారు. చిరుతను చూసిన పశువులు బెదిరి వెనుకకు పరుగులు తీశాయి. వారు గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా అందరూ వచ్చి పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూ గట్టిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది.