సక్రమంగా విధులు నిర్వహించని కారణంగా నాగవరం పంచాయతీ వడ్డిపల్లెలో పనిచేస్తున్న బిఎల్ఓ చిట్టపురెడ్డి గంగాధర్ ను సస్పెండ్ చేసినట్లు చిట్వేలి మండల రెవెన్యూ అధికారిణి శిరీష తెలిపారు. బుధవారం చిట్వేలి ఎమ్మార్వో కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ బిఎల్ఓ సరిగా విధులు నిర్వహించడం లేదని రాజంపేట పార్లమెంట్ టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శి రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.