రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. బుధవారం ప్రొద్దుటూరు లోని స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహిళ కాన్పు కోసం వైద్యులు రక్తం అవసరమని సూచించారు. ఆమె బంధువులు ఆదరణ సంస్థను సంప్రదించారు. ఆయన స్పందించి సంస్థ ఆధ్వర్యంలో కమాల్ బాషా చేత రక్తదానం చేయించారు. ఈ సందర్బంగా రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు.