ఓబులవారి పల్లి మండలం గాదెల వెంకటాపురం గ్రామానికి చెందిన గబ్బి వెంకటా చలపతి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య గురించి తెలుసుకుని డయాలసిస్ చికిత్స కొరకు గురువారం కొమ్మూరు ఉమా శంకర్ రెడ్డి, కొమ్మూరు నాగేంద్ర రెడ్డి, కొమ్మూరు మస్తాన్ రెడ్డి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహులు, కొమ్మూరు సుబ్బనరసా రెడ్డి, ఈసం చెంచు రెడ్డి పాల్గొన్నారు.