మాదిగల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతకు నిరసనగా జనవరి 6న యూనివర్సిటీల ఎదుట మహాధర్న విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మానికింది వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం మైదుకూరు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. జనవరి 6 న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి నిరాకరించినందుకు నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa