దేశంలోనే అత్యధిక పింఛన్ అందిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం పెనగలూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన పించన్ల పంపిణి కార్యక్రమంలో ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి గారి తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ. 3 వేలకు పింఛన్లను పెంచడం జరిగిందన్నారు.