తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 12 నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగియనున్నాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్య యనంగా పిలిచే ఈ క్రతువు ప్రారంభమవుతుంది. తొలి 11 రోజులను పగల్ పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తుగా వ్యవహరిస్తారు. 24వ రోజున శ్రీవరాహ స్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.