పోలీసులు, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగించని ప్రత్యేక సైరన్ శబ్దాలను అంబులెన్స్‌లకు ఉపయోగించాలని మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రస్తుత సున్నిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, శాంతిభద్రతల సమర్థ నిర్వహణ కోసం ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. పోలీసుల సైరన్ శబ్ధం విని ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయని, అందువల్ల అంబులెన్సుల సైరన్ శబ్ధం ప్రత్యేకంగా ఉండాలని హోంశాఖ ప్రకటనలో పేర్కొంది.