నేపాల్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రసిద్ధ పశుపతినాథ్ దేవాలయాన్ని భారత విదేశాంగ మంత్రి డా.ఎస్.జైశంకర్ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన X లో పోస్ట్ చేశారు. ‘పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించడం మర్చిపోలేని అనుభూతి. ఇరుదేశాలకు చెందిన ప్రజల శ్రేయస్సు కోరుతూ పూజలు నిర్వహించాం’ అని ట్వీట్ చేశారు.