విశాఖ జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గురువారం జిల్లాలో మరో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 52కు చేరింది. ప్రస్తుతం 38 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. వీరిలో 30 మంది వరకూ హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా మిగిలినవారు ఆస్పత్రిలో చేరారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు మస్ట్ అని చెబుతున్నారు.