సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి పై శుక్రవారం ఛత్తీస్ ఘడ్ నుంచి తిరుమల వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. బస్సు డ్రైవర్ విశ్వక్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించి పోలీసులు కేసు నమోదు చేశారు.