త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దామని మంత్రి విడదల రజనీ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక సాయిబాబ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో గురువారం గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజనీ ఆధ్వర్యంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఇంచార్జిలు, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి రజనీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇంచార్జిలు, జేసీఎస్ క్లస్టర్ ఇంచార్జిలు, గృహ సారధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.