అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్నివిధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన ముఖ్యమంత్రి మా జగన్‌మోహన్‌రెడ్డి అని జోగి రమేష్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి మన జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రమే అని చెప్పుకోవాలి. కేబినెట్‌లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది. 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం అని తెలిపారు.