వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.... మన అందరి తలరాతలు మార్చే జగనన్నను ప్రేమించాలి. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సర్కారు బళ్ల రూపురేఖలు మార్చారు జగనన్న. మన పిల్లలు సగర్వంగా తలెత్తుకుని బళ్లకు వెళ్లేలా చేశారు జగనన్న. అక్కాచెల్లెమ్మలకు ప్రతి పథకం ఇంటివద్దకే వచ్చేలా చేశారు జగనన్న. లంచాలు లేవు. వివక్ష లేదు. పారదర్శక పాలన చూస్తున్నాం. చేయూత,ఆసరా, సున్నావడ్డీ రుణాలు, ఇళ్లస్థలాలతో పాటు, ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు పెద్ద భరోసా నందిస్తున్నారు సీఎం జగనన్న అని తెలిపారు.