వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ గోరంట్లమాధవ్ మాట్లాడుతూ.... సంక్షేమ పథకాలతో జగనన్న విప్లవాత్మకమార్పులే తీసుకొచ్చారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలలో నాయకత్వ లక్షణాలు పెంచి, వారిని నాయకులుగా తీర్చిదిద్దారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ప్రత్యేకహోదాను మోదీకి అర్పించుకుని, ప్రత్యేకప్యాకేజీని జేబులో వేసుకున్నవాడు చంద్రబాబు. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాడు. హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే అవకాశాన్ని వదిలిపెట్టినవాడు చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో భయపడి పారిపోయివచ్చిన వాడు చంద్రబాబు. వ్యవసాయాన్ని దండగ అన్న చంద్రబాబు, మహిళల్ని సైతం హామీల పేరుతో మోసం చేసినవాడు చంద్రబాబు.బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను అవమానించి, చులకనగా చూసినవాడు చంద్రబాబు అని ఆరోపించారు.