వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ..... మనం ఎప్పుడు కనివిని ఎరుగని సామాజిక సాధికారతను మనకు అందించాడు జగన్‌మోహన్‌రెడ్డి. పేదలందరూ బాగుండాలి, వారి తలరాతలు మారాలి, వారి పిల్లలు పెద్ద చదువులు చదవాలని జగనన్న తపిస్తారు. పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటి గడపల దగ్గరే అందిస్తున్నారు.పేద పిల్లలకు కార్పొరేట్‌స్థాయి చదువులు సర్కారు బడులకే తీసుకొచ్చారు జగనన్న. మాట ఇస్తే తప్పని జగనన్న పేదల పాలిట పెన్నిధి. పేదలందరికీ రూ.25లక్షల వరకు ఉచితవైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని బలోపేతం చేసిన జగనన్న మామూలు రాజకీయనాయకుడు కాదు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేసే చంద్రబాబు ఎక్కడ? ప్రజలను నమ్ముకుని..వారి మంచికోసం పాలన చేస్తున్న జగనన్న ఎక్కడ? జగన్ పాలనలో వివక్షకు చోటు లేదు. అదే బాబు పాలనలో అడుగడుగునా వివక్షే. పార్లమెంటులో స్థానాలు, శాసనసభ,శాసనమండలి, స్థానిక సంస్థల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు స్థానాలు కల్పించిన సామాజికసాధికార నేత జగన్ మోహన్‌రెడ్డి. పేదరికం పోవాలి. అంతవరకు నేను పోరాటం చేస్తానంటున్న జగనన్న గురించి మనం ఆలోచించాలి. జగనన్న వస్తేనే మనకు సంక్షేమపథకాలు అని తెలిపారు.