పాణ్యం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర విజయవంతం అయింది. నాలుగుమండలాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దారెంబడి ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీసీఎం నారాయణస్వామి, ఎంపీలు గోరంట్లమాధవ్,గురుమూర్తి,సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే సుధాకర్‌లు ప్రసంగించారు. డిప్యూటీసీఎం నారాయణస్వామి, ఎంపీ సంజీవ్‌కుమార్ ప్రసంగాలు బావున్నాయి. సభ పూర్తయ్యేవరకు జనం అసాంతం కదలకుండా ఉన్నారు. ఉపన్యాసాలు విన్నారు.