సీఎం జగన్ ఇస్తున్న సంక్షేమ పధకాలు పొందుతున్న వారిలో భాగంగా , నేను డిగ్రీ పూర్తిచేశాను, మా నాన్న చిన్న బట్టల షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు, అమ్మ చనిపోయారు, నేను ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇంకా పై చదువులు చదవాలనుకున్నా దూరమయ్యాను, నేను టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నాను, మా వలంటీర్ వచ్చి జగనన్న చేదోడు పథకం కింద సాయం చేస్తున్నారని చెప్పారు, నేను లబ్ధిపొందాను, ఈ డబ్బుతో నేను వ్యాపారాన్ని పెంచుకున్నాను, నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మీరు ఇచ్చే ఈ సాయం నా జీవితానికి చాలా ఉపయోగకరం, ఈ డబ్బు కొందరికి చిన్న సాయం అవ్వచ్చు, ఈ పెట్టుబడితో నా కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా, నా సొంతింటి కల కూడా మీ వల్ల నెరవేరింది, త్వరలో గృహప్రవేశం కూడా చేస్తాం, ఇది నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నా, నాకు అమ్మ లేని లోటును అన్నగా మీరు తీరుస్తున్నారు, దిశ యాప్ భరోసాతో ఒంటరిగా బయటికి వెళుతున్నాను, ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ అందుతున్నాయి, మిమ్మల్ని మేం సీఎంగా గెలిపిస్తాం, మీరే మళ్ళీ సీఎంగా రావాలి, ధ్యాంక్యూ అన్నా అని శ్రీకాకుళం నుండి సాయి ప్రత్యూష అనే లబ్ధిదారు తెలిపారు .