రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలుచేయలేనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ.... దేశంలో మరే రాష్ట్రం డీబీటీ ద్వారా సుమారు రూ. 2.46 లక్షల కోట్లుపైగా ఇంత పెద్ద మొత్తంలో నేరుగా ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. పాదయాత్రలో ప్రజల కష్టాలు కన్నీళ్ళు స్వయంగా చూసి ఇన్ని పథకాలకు రూపకల్పన చేశారు, అర్హత ఉండి పధకాలు అందుకోనివారికి కూడా అందజేసి గ్రామంలోని ఆఖరి కుటుంబం వరకు సంక్షేమం అందాలన్న మీ ఆలోచనకు జేజేలు, ఇంకా లబ్ధి పొందని వారిని చూసి మరీ జల్లెడపట్టి మరీ ఇవ్వాలనే మీ మాట గొప్పది, ఇది మీ విస్వసనీయతకు సాక్ష్యం, ఠంచన్ పెన్షన్ ఇవ్వడమే కాదు పెన్షన్ పెంచాలన్న మీ నిర్ణయంపై మీ పట్ల నమ్మకం, విశ్వాసం మరింత పెరిగాయి, మీరు పేదల కళ్ళలో ఆనందం చూడాలన్న తపనను చూసి సహించలేని కొందరు పచ్చి విషం చిమ్ముతూ ప్రజల్లోకి అవాస్తవాలను పంపుతున్నా, ప్రజలు వాస్తవాలు గుర్తించారు, వారి మనసులో మీరు చెరగని ముద్ర వేసుకున్నారు, ఆ ఫలాలు వారికి అందాయి, ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు, సామాజిక న్యాయం, సాధికారత మీ వల్లే సాధ్యమని నమ్ముతున్నారు, ఎప్పటికీ మీరే మాకు సీఎంగా ఉండాలని, ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూన్నాను అని తెలిపారు.