ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల పైన కొనసాగుతున్న సందిగ్ధత పై క్లారిటీ వచ్చింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే, సెలవులు తగ్గించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగింది. కానీ, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే సెలవులను నిర్దారించింది. ఇదే సమయంలో సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.