ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు… డిసెంబర్ 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.