విజయవాడ పరిధిలోని చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. లోక్సభ స్పీకర్ అనుమతి కోరానని.. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని అన్నారు. ఆపై మా వాళ్ళు ఏం చెయ్యమంటే అదే చేస్తానన్నారు.