నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుని ఈ సారి గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారట. నరసరావుపేట టికెట్ లావుకి ఇవ్వాలని లోక్సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం సీఎంను కోరినప్పటికీ జగన్ వినిపించుకోలేదని టాక్. తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్టు సమాచారం. తనకు నరసరావుపేట ఇస్తే పోటీ చేస్తానని లేని పక్షంలో బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పినట్లు సమాచారం.